#24 అంతలోనె తెల్లవారె amtalOne tellavAre

Titleఅంతలోనె తెల్లవారెamtalOne tellavAre
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
అంతలోనె తెల్లవారె అయ్యో యేమిసేతునే
కాంతుని మనసెంత నొచ్చెనొ
ఇంతి యెటుసైతునే




||అంత||
amtalOne tellavAre ayyO yEmisEtunE
kAmtuni manasemta nochcheno
imti yeTusaitunE



||amta||
చరణం
charaNam 1
కొదమ గుబ్బలెదను గదియ నదుముకొదుచు చాలా
పెదవి తేనె లాననా మదిని దోచువేళ





||అంత||
kodama gubbaledanu gadiya nadumukoduchu chAlA
pedavi tEne lAnanA madini dOchuvELa



||amta||
చరణం
charaNam 2
పంతమున తటాల లేచి పైటకొంగు జారగా
కాంత దొంతర విడె మొసంగి కౌగలింపుచుండగా



||అంత||
pamtamuna taTAla lEchi paiTakomgu jAragA
kAmta domtara viDe mosamgi kougalimpuchumDagA



||amta||
చరణం
charaNam 3
సోమభూపాల రమ్మని భామ ప్రేమమీరగా
కామకేళిలోన మిగుల కలసిమెలసి యుండగా




||అంత||
sOmabhUpAla rammani bhAma prEmamIragA
kAmakELilOna migula kalasimelasi yumDagA


||amta||

3 thoughts on “#24 అంతలోనె తెల్లవారె amtalOne tellavAre

  1. ఈ జావళి సాహిత్య భేదంతో చలనచిత్ర గీతంగా ముద్దు బిడ్డ (1956) లో కళావంతుల నాట్య గీతంగా కనిపిస్తోంది.
    చూడండి: https://www.youtube.com/watch?v=sf0lwnhQpFk
    పల్లవి ఒకటే గానీ చరణాలు మారాయి. సినిమా పరంగా ఆ సృజనాత్మక స్వేచ్ఛ వారికుంటుంది కదా. అదే కారణం అయ్యుండొచ్చు. సంప్రదాయ సంగీత లక్షణాలకంటే తక్కువేం కాకున్నా, ఆలయ (దేవదాసీ) నృత్యాలుగా కొన్ని పసిద్ధాలు. సంగీత-సాహిత్యాలతో గాన, నృత్య గీతాలుగా జనసామాన్యానికి చేరువైన ఈ జావళీలు ఆపై సంప్రదాయ సంగీత కచ్చేరీల్లో సమాపనా గీతాలుగా, నృత్యాంశాలుగా వచ్చి చేరాయ్. పండిత-పామరుల ప్రశంసలూ అందుకున్నాయి. ఇప్పుడు దేవదాసీ వ్యవస్థలు లేకున్నా ఆ కళా పరిమళం ఏదో రూపంలో గుబాళిస్తూనే ఉంది.

    ఇప్పుడు ఇలా, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇక ఈ రచనల సుగంధం ఎప్పటికీ వాడిపోకుండా నిలిచే అవకాశం చిక్కింది.

    అయితే, బ్లాగ్ నిర్వాహకులకు విన్నపం: ఆయా రచనలకు సంబంధించి శ్రవ్య, దృశ్య – దృష్టాంతాలేవన్నా ఉంటే (లభ్యమైనంత వరకూ) వాటినీ ఇక్కడ పొందుపర్చవలసింది. లేదా వాటి తాలూకూ లంకె (web links), ఉంటే గనుక, ఈయగలరు.

    పస్తుతానికి కుతూహలురు, అభిరుచి వున్న కొందరు మాత్రం వీటి సొబగు ఆస్వాదిస్తున్నారు. అపుడు చక్రవర్తులో, వారి సామంతులో, సంగీత రసికత ఉన్న ప్రభువులో-ప్రజలో ఈ జావళీలు విని-కని ఆనందించారు. ఇప్పుడు ఇవి సామాన్య జనాభాకి అందుబాటులో లేవు అనడం కంటే, జనాభాకే తీరుబడి, ఆసక్తి సన్నబడిందనడం సబబు. అలాగని ఈ లలితకళల్ని ఏదో రూపంలో భద్రం చేయకపోతే (అన్నమయ్య కృతుల రాగిరేకుల భాండాగారంలా) ఎలా…ఇదిగో వంద-నూటిరవై ఏళ్ల నాటి ఈ రచనల్ని వారు ఒక పద్ధతిలో భద్రంగా అందుబాటులో వుంచటం సంతోషించదగ్గ విషయం.

    ఈ నాటి తరానికి, మరి ముందు తరాల వారికీ కొన్ని కళారూపాల్ని దృశ్య-శ్రవణ మాధ్యమంగా అందిస్తేనే మనసుకి హత్తుకొంటుంది. ఇప్పటి కాల పరిణామం అంతే. కాదనలేని వాస్తవం కనుక, ముఖ్యంగా చలన చిత్ర మాధ్యమం (సినిమా పరిశ్రమ) అందరినీ అలరించే మాధ్యమం, ఎన్నో ప్రయోగాలు చేసేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు సులువైన మార్గం కనుక, ప్రజా సమస్యలు, చరిత్ర, చారిత్రక వ్యక్తుల, సంప్రదాయాల, శాస్త్రీయ-కల్పనా జగత్తుల అభివ్యక్తికి సినిమా ఒక చక్కని మాధ్యమంగా ఎప్పుడూ నిలుస్తూనే ఉంది కనుక, (సినిమా కాకుంటే సామాజిక మాధ్యమాలు) ఇలా డిజిటల్ సాంకేతిక ప్రతికృతులుగా లలితకళల కోశం తయారైతే ఇవి కూడా పెద్ద గ్రంథాలయాలో, అధ్యయనకేంద్రాలో అయి తీరుతాయ్. అస్తు.

    ** ** **

    ఒక్కసారి ఈ https://www.youtube.com/watch?v=xVSTyBr0EAk – జయసింహ (1955) నాటి చలన చిత్ర గీతాన్ని పరిశీలించగలరు. ఈ గీతం ఏమన్నా జావళీ కోవ లోకి వచ్చునా చూడతగును.

    Like

    • “ఆయా రచనలకు సంబంధించి శ్రవ్య, దృశ్య – దృష్టాంతాలేవన్నా ఉంటే” – తప్పకుండా వెతుకుతాము. ఈ లోపు మీకు కనిపించిన / వినిపించిన లంకెలు / లింకులు పంపగలరు!
      “జయసింహ (1955) నాటి చలన చిత్ర గీతాన్ని” – కొద్ది రోజులు గడువివ్వండి. మా దగ్గర ఉన్న జావళీలలొనూ, మరియు ఒకరిద్దరు నిపుణుల అభిప్రాయం కనుక్కుని బదులిస్తాను.
      ఇలా మీరు ఆసక్తితో వ్యాఖ్యానించడం చాలా సంతోషంగా ఉంది! 🙏

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s