Title | ఎంతొ నెరజాణుడమ్మా | emto nerajANuDammA |
Written By | ||
రాగం rAga | చామరం | chAmaram |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | ఎంతొ నెరజాణుడమ్మా యశొదా నీ కొడుకెంతొ నెరజాణుడమ్మా | emto nerajANuDammA yaSodA nI koDukemto nerajANuDammA |
చరణం charaNam 1 | ఎక్కడివి యీ కమ్మలు చక్కగను లేదనుచు టక్కుగ నా చెంతచేరి చెక్కిలిని నొక్కెగదె | ekkaDivi yI kammalu chakkaganu lEdanuchu Takkuga nA chemtachEri chekkilini nokkegade |
చరణం charaNam 2 | కాటుక కన్నుల నులగడు నీటుగ లేదనుచును గోట కనుగీటి పట్టు నోట ముద్దు బెట్టెగదే | kATuka kannula nulagaDu nITuga lEdanuchunu gOTa kanugITi paTTu nOTa muddu beTTegadE |
చరణం charaNam 3 | తామిచ్చె రమ్మని తలుపు వోరగ జేసియా బాయను నా చనుదోయి చయ్యన నను బట్టెగదె | tAmichche rammani talupu vOraga jEsiyA bAyanu nA chanudOyi chayyana nanu baTTegade |
చరణం charaNam 4 | మానినుల నిట్టు సేయమాన్యయని పలుక మానమేది చూపుమని మానిని కొంగీడ్వాసాగె | mAninula niTTu sEyamAnyayani paluka mAnamEdi chUpumani mAnini komgIDvAsAge |