Title | కోపము రాదా | kOpamu rAdA |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ కాపి | ChatrapurI kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కోపము రాదా యవ్వరికైనా ఆపణతింటిలో ఆడిన మాటకు | kOpamu rAdA yavvarikainA ApaNatimTilO ADina mATaku |
వాపోవగ మును వచ్చిన త్రోవను పోపోపొమ్మనీ సాపుగ దెలపె | vApOvaga munu vachchina trOvanu pOpOpommanI sApuga delape | |
చరణం charaNam 1 | యంతపచారము జేసితి వచటా అంతరంగుడవని ఆదరించుచుంటి సుంతైన యంచక ఇంతి పాలాయెరా ఇంత హీనుడవనీ యెరుగకపోతీ | yamtapachAramu jEsiti vachaTA amtaramguDavani AdarimchuchumTi sumtaina yamchaka imti pAlAyerA imta hInuDavanI yerugakapOtI |
చరణం charaNam 2 | ఈ విధి భ్రమయక అతనితో నేస్తము గావించినందుకు కలిగిన లాభము ఏ వగలాడి నీకేమి బోధించెరా నావలె దానికి గావలెగాదా | I vidhi bhramayaka atanitO nEstamu gAvimchinamduku kaligina lAbhamu E vagalADi nIkEmi bOdhimcherA nAvale dAniki gAvalegAdA |
చరణం charaNam 3 | వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా వర నాటక సూత్రధారుడవనుచుంటి నిరతము నీవని నెరనమ్మి యుంటిరా పర సతులను గూడి పలచనజేసితె | varaleDu SrIChatrapura jaganmOhanA vara nATaka sUtradhAruDavanuchunTi niratamu nIvani neranammi yumTirA para satulanu gUDi palachanajEsite |