Title | సరసకు వేలరా | sarasaku vElarA |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సరసకు వేలరా సమి ఏర మేర గాదురా | sarasaku vElarA sami Era mEra gAdurA |
చరణం charaNam 1 | మరులుకున్న నాపై ఇంత మర్మమేల దెలుపరా తరుణి బెట్టినట్టి మందు తలకెక్కెనటరా | marulukunna nApai imta marmamEla deluparA taruNi beTTinaTTi mamdu talakekkenaTarA |
చరణం charaNam 2 | నిరతము నీవనుచును నెరనమ్మి యుంటిరా సరగున నన్నేలుకోరా సమి నీకు మ్రొక్కెరా | niratamu nIvanuchunu neranammi yumTirA saraguna nannElukOrA sami nIku mrokkerA |
చరణం charaNam 3 | పరుల వలెనె నా వలపు భరియింపజాలరా మారు నిల్లు చమ్మగిల్లి మైమరువసాగెరా | parula valene nA valapu bhariyimpajAlarA mAru nillu chammagilli maimaruvasAgerA |
చరణం charaNam 4 | ధరను శ్రీ ఛత్రపుర వరజగన్మోహనా సరస నాటకానిలయ సమయమాయె గూడరా | dharanu SrI Chatrapura varajaganmOhanA sarasa nATakAnilaya samayamAye gUDarA |