Title | సారసాక్షి నీపై (ప్రతి) | sArasAkshi nIpai (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | సారసాక్షి నీపై మది చాల మరులు కొన్నదిరా మారుకేళి గూడ రాక మర్మకుల సింధుధీర | sArasAkshi nIpai madi chAla marulu konnadirA mArukELi gUDa rAka marmakula simdhudhIra |
చరణం charaNam 1 | కన్నెనీదు వన్నెబన్నె అన్ని చూచి వలచి మది యున్నదాని నెనరుబూనకున్న నోర్వజాలదుర | kannenIdu vannebanne anni chUchi valachi madi yunnadAni nenarubUnakunna nOrvajAladura |
చరణం charaNam 2 | మగువ బొమలు మరుని యిల్లు మధురవాణి పాలిండ్లు సొగసుమీరిన పూలచళ్ళు తగుజాణర నీకు జెల్లు | maguva bomalu maruni yillu madhuravANi pAlimDlu sogasumIrina pUlachaLLu tagujANara nIku jellu |
చరణం charaNam 3 | వసుధ వెలయు శ్రీపీఠి వంశోదధి సుధాకర రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీర | vasudha velayu SrIpIThi vamSOdadhi sudhAkara rasikuDau dAni chEkOra rAghavAchArya sudhIra |