Title | యేరా మోడిసేయ | yErA mODisEya |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యేరామోడి సేయ మేర మనోహర | yErAmODi sEya mEra manOhara |
రారా నీకొగి వీరా నన్నేలుకోర | rArA nIkogi vIrA nannElukOra | |
చరణం charaNam 1 | బాలప్రాయము నుండి బాళి నిను బెంచి మేలుగన నెంచు నన్ను మేలమాడెద వౌర | bAlaprAyamu numDi bALi ninu benchi mElugana nemchu nannu mElamADeda vaura |
చరణం charaNam 2 | ఏట బెరిగెడు వాని పూట బెంచి తుదిని నోటి మాటలకేను నోచనైతి నా సామి | ETa berigeDu vAni pUTa bemchi tudini nOTi mATalakEnu nOchanaiti nA sAmi |
చరణం charaNam 3 | నిలయమున నినుగానను నింటగల పనులెల్ల మరచి తల వాకిలిల్లు గలచి యుందుగదరా | nilayamuna ninugAnanu nimTagala panulella marachi tala vAkilillu galachi yumdugadarA |
చరణం charaNam 4 | కరిగిరి వరదుని మరిదివైన నీకు హరి హరి సుంతైన గరుణలేక నాపైని | karigiri varaduni maridivaina nIku hari hari sumtaina garuNalEka nApaini |