Title | యేమి సేతునే (ప్రతి) | yEmi sEtunE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యేమి సేతునే ఓ సఖీ కామిని మణి గూడి వాడు కనుల జూడడాయె సఖి | yEmi sEtunE O sakhI kAmini maNi gUDi vADu kanula jUDaDAye sakhi |
చరణం charaNam 1 | మందగమన వాని మనసు నందు నేమి దోచెనేమొ ఇందీవరాక్షి బెట్టు మందు తలకెక్కె సఖి | mamdagamana vAni manasu namdu nEmi dOchenEmo imdIvarAkshi beTTu mamdu talakekke sakhi |
చరణం charaNam 2 | నా సరివారిలో నన్ను నగుబాటు జేసి మున్ను జేసిన బాసలేమి జేసి మరచెనే వో సఖీ | nA sarivArilO nannu nagubATu jEsi munnu jEsina bAsalEmi jEsi marachenE vO sakhI |
చరణం charaNam 3 | మగువరో పురుషుల నమ్మదగదని కొందరు దెల్ప జగతిని యా మాట నిజము సల్పినాడే వో సఖి నే | maguvarO purushula nammadagadani komdaru delpa jagatini yA mATa nijamu salpinADE vO sakhi nE |
చరణం charaNam 4 | రేపల్లె పురీషుడైన గోపాలుడీ సమయమందు పాపమంచు మదినెంచక పంతగించెనే యో సఖీ | rEpalle purIshuDaina gOpAluDI samayamamdu pApamamchu madinemchaka pamtagimchenE yO sakhI |