Title | యెంత పాపము | yemta pApamu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యెంత పాపమింతినైతినే చెలి | yemta pApamimtinaitinE cheli |
పంతగించి పోయ్యే సామి బతిమాలిన రాడుగదె | pamtagimchi pOyyE sAmi batimAlina rADugade | |
చరణం charaNam 1 | కృప దొలంగి విభుడు చాల గినిసి వేసిపోయెగా చపలనేత్ర యెట్లు సయితు సరసుని గురు విరహ తాప | kRpa dolamgi vibhuDu chAla ginisi vEsipOyegA chapalanEtra yeTlu sayitu sarasuni guru viraha tApa |
చరణం charaNam 2 | పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు వాని వలచి మోసపోయితిని కిసలయపాణి యేమిసేతు | paluku palukulaku tEniya loluku mATalADu vAni valachi mOsapOyitini kisalayapANi yEmisEtu |
చరణం charaNam 3 | దివిజపతి ముఖ వినుత బలదేవ రసికభుజగవరుని యవిరళ రతిసుఖ సంపదలబ్బునో యిక నబ్బదో చెలి | divijapati mukha vinuta baladEva rasikabhujagavaruni yaviraLa ratisukha sampadalabbunO yika nabbadO cheli |