Title | సామిని దలచకె (ప్రతి) | sAmini dalachake (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | సామిని దలచకె సఖి కామిని పతి నిటు ఘనమానసమున | sAmini dalachake sakhi kAmini pati niTu ghanamAnasamuna |
చరణం charaNam 1 | భామిని జేసిన బాసలు మరువక కామించి యెన్ని దినములు గడపి వేసారితినే | bhAmini jEsina bAsalu maruvaka kAminchi yenni dinamulu gaDapi vEsAritinE |
చరణం charaNam 2 | సదయుని రాక కెదురెదురే నే జూచి మదనుని బారికిని మగువరోలోనైతినే | sadayuni rAka keduredurE nE jUchi madanuni bArikini maguvarOlOnaitinE |
చరణం charaNam 3 | యే సఖి గూడెనొ వేడుకచే రేయి నాసరివారిలోన నన్నిటుల జేసెనే | yE sakhi gUDeno vEDukachE rEyi nAsarivArilOna nanniTula jEsenE |
చరణం charaNam 4 | విటులతో కలిసే విధములు మరి చూచి కటకటాయని నే మది కరగి చింతించితినే | viTulatO kalisE vidhamulu mari chUchi kaTakaTAyani nE madi karagi chimtimchitinE |
చరణం charaNam 5 | పొలతిరో శ్రీ రేపలె పురవరునితో నే కలసి సుఖించుటకు రుణము కలికిరో లేదాయెనే | polatirO SrI rEpale puravarunitO nE kalasi sukhinchuTaku ruNamu kalikirO lEdAyenE |