Title | కామిని వాని (ప్రతి) | kAmini vAni (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కామిని వానితోడ గరుణ యుంచు మనవే | kAmini vAnitODa garuNa yumchu manavE |
సామి ప్రేమ నిక్కమని చాల నమ్మియుంటినే వో | sAmi prEma nikkamani chAla nammiyumTinE vO | |
చరణం charaNam 1 | నెలత నన్ను విడచి దాని పలుకులు విని బూరుగ చెంత వలచి నిలుచు చిలుక సామెత వలెను జేయవలదనవే | nelata nannu viDachi dAni palukulu vini bUruga chemta valachi niluchu chiluka sAmeta valenu jEyavaladanavE |
చరణం charaNam 2 | చిగురు విల్తుడు ములుకు లేయ తెగువ శాయ వలదాయ పగవారిలో నగడు శేయ భామ యెటుల తాళుదునే | chiguru viltuDu muluku lEya teguva SAya valadAya pagavArilO nagaDu SEya bhAma yeTula tALudunE |
చరణం charaNam 3 | సుదతి శ్రీ రావు వంశజ సూర్య నృపతి మదిగోరి ముదితా యిటులున్న దాని మోసబుచ్చుట పాయమేవో | sudati SrI rAvu vamSaja sUrya nRpati madigOri muditA yiTulunna dAni mOsabuchchuTa pAyamEvO |