Title | నీ సరియే చాన (ప్రతి) | nI sariyE chAna (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | నీ సరియే చాన నే గాన జగాన నా సరివారిని నీవుగానా ఆసతో జేసిన బాసలు ఓ సఖి మోసపుచ్చి యీ సరి గాసిల జేసెనే | nI sariyE chAna nE gAna jagAna nA sarivArini nIvugAnA AsatO jEsina bAsalu O sakhi mOsapuchchi yI sari gAsila jEsenE |
చరణం charaNam 1 | వద్దు వద్దననా వద్దికి వచ్చియొ ముద్దియ తద్దయో ముద్దివ్వలేదా అద్దిర యద్దాని బుద్ధులు విన్నావొ గద్దించి యీ ప్రొద్దు వద్దురా వద్దన | vaddu vaddananA vaddiki vachchiyo muddiya taddayO muddivvalEdA addira yaddAni buddhulu vinnAvo gaddimchi yI proddu vaddurA vaddana |
చరణం charaNam 2 | మక్కువచే రతి స్రుక్కించి చెక్కులు నొక్కి నాపక్కను నొగిజేరలేదా టక్కులాడి నిక్కమని మిక్కిలి నిక్కిన ఇక్కపటము జేసితి వక్కటా అక్కటా | makkuvachE rati srukkimchi chekkulu nokki nApakkanu nogijEralEdA TakkulADi nikkamani mikkili nikkina ikkapaTamu jEsiti vakkaTA akkaTA |
చరణం charaNam 3 | ధారుణి రేపలె శ్రీరాజగోపాల చేరరారాయని చేపట్టలేదా సారసాక్షి నే బహు దూరమెంచ నీదరి జేరిన నీరీతి సేయుట సేమామ | dhAruNi rEpale SrIrAjagOpAla chErarArAyani chEpaTTalEdA sArasAkshi nE bahu dUramemcha nIdari jErina nIrIti sEyuTa sEmAma |