Title | వద్దురా రద్దు (ప్రతి) | vaddurA raddu (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వద్దురా రద్దు పోరా వెన్నెలా వచ్చెవేళ గాదుర అద్దెర మాయత్త గద్దించు గయ్యాళి సుద్దులు విను బుధ్ధి కద్దురా కద్దురా | vaddurA raddu pOrA vennelA vachchevELa gAdura addera mAyatta gaddimchu gayyALi suddulu vinu budhdhi kaddurA kaddurA |
చరణం charaNam 1 | మామ మన్నెకాడురా నాధుడు మర్యాద చేయడురా కామునికేళిలో గలసి మెప్పించెద భామిని రమ్మనెడు బాగుర బాగుర | mAma mannekADurA nAdhuDu maryAda chEyaDurA kAmunikELilO galasi meppimcheda bhAmini rammaneDu bAgura bAgura |
చరణం charaNam 2 | మరది రచ్చబెట్టురా యేరాలు మరిమరి నను దిట్టురా విరిబంతులిచ్చెద వెలది మాటాడుమని సరసములాడేవు చాలుర చాలుర | maradi rachchabeTTurA yErAlu marimari nanu diTTurA viribamtulichcheda veladi mATADumani sarasamulADEvu chAlura chAlura |
చరణం charaNam 3 | చాడికోరుగదరా జాణ నాయాడబిడ్డ వినరా ఆడేది వినుచు నా తోడ గూడుము యోచేడె రమ్మనుట చెడ్డరా చెడ్డరా | chADikOrugadarA jANa nAyADabiDDa vinarA ADEdi vinuchu nA tODa gUDumu yOchEDe rammanuTa cheDDarA cheDDarA |
చరణం charaNam 4 | వదినైతె నాలిముచ్చుర పొరుగు వారిది చూడ వాదువచ్చుర పదరా రేపలె గోపాలుడ ప్రఖ్యాతి గదురా యీ మర్యాద కాదుర కాదుర | vadinaite nAlimuchchura porugu vAridi chUDa vAduvachchura padarA rEpale gOpAluDa prakhyAti gadurA yI maryAda kAdura kAdura |