Title | సరసిజముఖి | sarasijamukhi |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సరసిజముఖిరో నా సామినిందు తోడితేవే | sarasijamukhirO nA sAminindu tODitEvE |
చరణం charaNam 1 | అరమరేల ప్రాణేశుని చరణంబులు నెరనమ్మితి మరుకేళికి సరగున యిటు సజలజశరుడు నేడు పూని చాల బాణములేయగాను తలచి తాళలేకయున్న కలికిన నిను బలు విధముల కలిపిన శ్రీ కమలాక్షుని | aramarEla prANESuni charaNambulu neranammiti marukELiki saraguna yiTu sajalajaSaruDu nEDu pUni chAla bANamulEyagAnu talachi tALalEkayunna kalikina ninu balu vidhamula kalipina SrI kamalAkshuni |
చరణం charaNam 2 | సుందరాంగి మున్ను నను సుందరాకారుడు జూచి మందగమన నాదు మనము నందున నే పొందుగ భ్రమ జెందితినని చెలువుడనియె | sumdarAmgi munnu nanu sumdarAkAruDu jUchi mamdagamana nAdu manamu namduna nE pomduga bhrama jemditinani cheluvuDaniye |
చరణం charaNam 3 | స్థిరతరమతి శ్రీ గౌరీశెట్టి శ్రీరామాఖ్యుని కరుణజూచి రమ్మనె మందరధరుని వరసుందర తర గాత్రుని సరసుని యిటు | sthirataramati SrI gourISeTTi SrIrAmAkhyuni karuNajUchi rammane mamdaradharuni varasumdara tara gAtruni sarasuni yiTu |