Title | యో చెలి | yO cheli |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | జుల్వా | julvA |
పల్లవి pallavi | యో చెలి యో చెలి యో చెలి యో చెలీ యీ చలంబేల జేసెద | yO cheli yO cheli yO cheli yO chelI yI chalambEla jEseda |
చరణం charaNam 1 | పంతగించి సామి నను పగగ నెంచెనే కంతుని కేళిలోన వాని కలియ జేయవే చెలి | pamtagimchi sAmi nanu pagaga nemchenE kamtuni kELilOna vAni kaliya jEyavE cheli |
చరణం charaNam 2 | యింతి బోధనలు విని యేమరకను దానిగూడి కాంతుడు యిందువచ్చి నాపై కరుణ జూడడే చెలి | yimti bOdhanalu vini yEmarakanu dAnigUDi kAmtuDu yimduvachchi nApai karuNa jUDaDE cheli |
చరణం charaNam 3 | సారసాక్షి సామిగూర్చితే రమణిరో వినుము శృంగారపు సొమ్ములిచ్చెదను కరుణ నేలవే చెలి | sArasAkshi sAmigUrchitE ramaNirO vinumu SRmgArapu sommulichchedanu karuNa nElavE cheli |
చరణం charaNam 4 | ధరణి నరసాపుర విహారుని ఉరగరచిత భూషణునీ తరుణి యెడల కరుణ నుంచి దయను గూడమనవె చెలి | dharaNi narasApura vihAruni uragarachita bhUshaNunI taruNi yeDala karuNa numchi dayanu gUDamanave cheli |