#228 భామ రావే bhAma rAvE

Titleభామ రావే (ప్రతి)bhAma rAvE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
భామ రావే భయము నీకేలే
కాముని కేళికి కరుణ జూచి యిటు
bhAma rAvE bhayamu nIkElE
kAmuni kELiki karuNa jUchi yiTu
చరణం
charaNam 1
యింత నాపై పంతమిదేలే
కంతుని బారికి గాసిజెందితిని
yimta nApai pamtamidElE
kamtuni bAriki gAsijemditini
చరణం
charaNam 2
చిన్ననాడె నీ చిన్నెలు జూచి
కన్నెరో నిను వలచియున్న వాడనిక
chinnanADe nI chinnelu jUchi
kannerO ninu valachiyunna vADanika
చరణం
charaNam 3
ఆసతో మున్ను జేసిన బాసలు
మోసములాయెనే వో సఖి వినవే
AsatO munnu jEsina bAsalu
mOsamulAyenE vO sakhi vinavE
చరణం
charaNam 4
యింత నిర్దయ నీకేల గల్గెనే
దంతి గమన నీ దయను విడువకను
yimta nirdaya nIkEla galgenE
damti gamana nI dayanu viDuvakanu
చరణం
charaNam 5
సుందరివని భ్రమ జెందితినిపుడే
పొందుగోరి నాయందు నెపముంచక
sumdarivani bhrama jemditinipuDE
pomdugOri nAyamdu nepamumchaka
చరణం
charaNam 6
చిత్రబంధముల చేతను రతి జేయ
స్తోత్రము జేసితి తోయజముఖి యిటు
chitrabandhamula chEtanu rati jEya
stOtramu jEsiti tOyajamukhi yiTu
చరణం
charaNam 7
వాదము సేయక వదనము జూపవే
నీదు చెలిమియును నిక్కము నమ్మితి
vAdamu sEyaka vadanamu jUpavE
nIdu chelimiyunu nikkamu nammiti
చరణం
charaNam 8
యెప్పుడు మదిలో నేమరకను నే
తప్పక దలచితి నిప్పుడు దయతో
yeppuDu madilO nEmarakanu nE
tappaka dalachiti nippuDu dayatO
చరణం
charaNam 9
అరమరలేలనె అతివరొ వినవే
కరుణ జూచి యిక కఠినము సేయక
aramaralElane ativaro vinavE
karuNa jUchi yika kaThinamu sEyaka
చరణం
charaNam 10
నాగభూషణుని వేగమె బ్రోచిన
భోగిశయనుడను భోగించుటకును
nAgabhUshaNuni vEgame brOchina
bhOgiSayanuDanu bhOgimchuTakunu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s