Title | ధర్మ సంవర్ధని | dharma samvardhani |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | ధర్మ సంవర్ధని మాయమ్మా నమ్మితి నేనీ దాసుడను నను బ్రోవవలెనమ్మా చర్మవసనుని రాణియౌ కొమ్మా ముఖ్యముగా నీ చరణమేగతి వేరు లేదమ్మా బంగరుబొమ్మా | dharma samvardhani mAyammA nammiti nEnI dAsuDanu nanu brOvavalenammA charmavasanuni rANiyou kommA mukhyamugA nI charaNamEgati vEru lEdammA bangarubommA |
చరణం charaNam 1 | తల్లి గర్భమునందు పడి పొరలీ తల్లడిల్లి యెన్ని జన్మములెత్తితినొ తొల్లి యిక యెన్ని జన్మములున్నవో మల్లీ యేవగనైన అన్ని భయములు తీర్పవే తల్లి కల్పకవల్లి | talli garbhamunandu paDi poralI tallaDilli yenni janmamulettitino tolli yika yenni janmamulunnavO mallI yEvaganaina anni bhayamulu tIrpavE talli kalpakavalli |
చరణం charaNam 2 | తప్పులెంచుట యేమొ యిటు గలదా నా వెతలెల్ల దలచి జూచుట నీకు దయరాద యిప్పుడును నా మొరలు వినలేదా వూరకుంటే నీ గొప్పతనమున కేమి మర్యాదా పావనివి గాదా | tappulenchuTa yEmO yiTu galadA nA vetalella dalachi jUchuTa nIku dayarAda yippuDunu nA moralu vinalEdA vUrakumTE nI goppatanamuna kEmi maryAdA pAvanivi gAdA |
చరణం charaNam 3 | శ్రీ రమేశుని తోడ నటియించి అందు భ్రమయించి శీఘ్రముగ మహిషాసురుని ద్రుంచి దీనరక్షక నీదు దయయుంచి యేవగనైనా దనరక నీదు కృపయుంచి బ్రోవ రక్షించి | SrI ramESuni tODa naTiyimchi amdu bhramayimchi SIghramuga mahishAsuruni drumchi dInarakshaka nIdu dayayumchi yEvaganainA danaraka nIdu kRpayumchi brOva rakshimchi |