Title | యీశ్వరాజ్ఞ | yISwarAjna |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు అది యెవరెరుగుదురు | yISwarAjna yEmo teliyadu adi yevareruguduru |
చరణం charaNam 1 | శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచునొకో సకల బాధలను బెట్టి సంకటపడజూచునో జగ | SASwataiSwaryamichchi sadA nanu brOchunokO sakala bAdhalanu beTTi samkaTapaDajUchunO jaga |
చరణం charaNam 2 | యెందున కొరలేని బ్రహ్మానందమొసగి గాచునో యెప్పటికీలాగున నన్ను హింసపరచి వేచునోపర | yemduna koralEni brahmAnamdamosagi gAchunO yeppaTikIlAguna nannu himsaparachi vEchunOpara |
చరణం charaNam 3 | నందనునిగ భావించి నను గారవించునో నలువురిలోపల మిక్కిలి నగుబాటుగ జేసునో | namdanuniga bhAvimchi nanu gAravimchunO naluvurilOpala mikkili nagubATuga jEsunO |
చరణం charaNam 4 | వెరవకుమని యభయమిచ్చి వేగమే రక్షించునో వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో | veravakumani yabhayamichchi vEgamE rakshimchunO vIDadhamuDu dushTuDanuchu viDuvaka SikshimchunO |
చరణం charaNam 5 | నిరతము నన్నాదాయపరునిగా నొనరించునో నిర్దయపరుడై నన్ను నీచమతుల జేర్చునో | niratamu nannAdAyaparunigA nonarimchunO nirdayaparuDai nannu nIchamatula jErchunO |
చరణం charaNam 6 | ధరణిలోన నన్ను భగవద్దాసకోటి జేర్చునొ దారాపుత్రాదుల వల తగులుకొనగ గూర్చునో | dharaNilOna nannu bhagavaddAsakOTi jErchuno dArAputrAdula vala tagulukonaga gUrchunO |
చరణం charaNam 7 | కూరిమితో సుదర్శనమొసగి గొబ్బున నను గారవించునో కొరమాలిన మానవులను కొనియాడగజేసునో ||జగదేశ్వరాజ్ఞ|| | kUrimitO sudarSanamosagi gobbuna nanu gAravimchunO koramAlina mAnavulanu koniyADagajEsunO ||jagadESwarAjna|| |