#236 యీశ్వరాజ్ఞ yISwarAjna

Titleయీశ్వరాజ్ఞ (ప్రతి)yISwarAjna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు
అది యెవరెరుంగుదురు
yISwarAjna yEmo teliyadu
adi yevarerumguduru
చరణం
charaNam 1
శాశ్వతైశ్వర్యమొసగి సదా నను బ్రోచునొకో
విశ్వాసము లేక నన్ను విడచునొ దయజూచునో
పర ||మే||
SASwataiSwaryamosagi sadA nanu brOchunokO
viSWAsamu lEka nannu viDachuno dayajUchunO
para ||mE||
చరణం
charaNam 2
దారాపుత్రాదుల యెడ ధైర్యమిచ్చి యేలునొకో
సారహీనమైన యీ సంసారాబ్ధిని ద్రోయునో జగ
dArAputrAdula yeDa dhairyamichchi yElunokO
sArahInamaina yI samsArAbdhini drOyunO jaga
చరణం
charaNam 3
జ్ఞానాజ్ఞానముల రెంటి క్రమమెరుగంగ దెలుపునొకో
మానహీనమైన యట్టి దుర్మదము గలుగజేయునోగో
jnAnAjnAnamula renTi kramamerugamga delupunokO
mAnahInamaina yaTTi durmadamu galugajEyunOgO
చరణం
charaNam 4
మాయను తొలిగించియు సన్మానము దయచేయునొకొ
యే యుపాయమునైనను నన్నేలక విడనాడునొ కా
mAyanu toligimchiyu sanmAnamu dayachEyunoko
yE yupAyamunainanu nannElaka viDanADuno kA
చరణం
charaNam 5
సమశీల వ్రతము నడువ సద్గుణములు గలుగజేయునో
యముని బారికిని ద్రోచి నాకతి శ్రమ కలిగించునో
samaSIla vratamu naDuva sadguNamulu galugajEyunO
yamuni bArikini drOchi nAkati Srama kaligimchunO
చరణం
charaNam 6
రాగద్వేషాది రహిత రంజకము గలుగ జేయునో
భోగమోహపాశములను బుధ్దిని బంధించునో లోక
rAgadwEshAdi rahita ramjakamu galuga jEyunO
bhOgamOhapASamulanu budhdini bamdhimchunO lOka
చరణం
charaNam 7
కొండగుంటూరి సత్కుల కోవిదుడౌ నాగభూషణు
దండజేరి నిండుమది నఖండ విభవమొసగునో విశ్వ
komDagumTUri satkula kOviduDau nAgabhUshaNu
damDajEri nimDumadi nakhamDa vibhavamosagunO viSwa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s