Title | దీనుని బ్రోవ (ప్రతి) | dInuni brOva (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బ్యేగ్ | byEg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | దీనుని బ్రోవ రావ దేవాది దేవ | dInuni brOva rAva dEvAdi dEva |
చరణం charaNam 1 | మానితజిత్ప్రభావ మన్నించ నీవే కావా సూనాస్త్ర జనక దేవా మహానుభావ | mAnitajitprabhAva mannimcha nIvE kAvA sUnAstra janaka dEvA mahAnubhAva |
చరణం charaNam 2 | మానక నిను మతిధ్యానము జేసితి శ్రీనాధా నీవేగతి సీతాపతి | mAnaka ninu matidhyAnamu jEsiti SrInAdhA nIvEgati sItApati |
చరణం charaNam 3 | కారణకారణ కరిభవమోచన సారసాయత లోచన సద్గుణావన | kAraNakAraNa karibhavamOchana sArasAyata lOchana sadguNAvana |
చరణం charaNam 4 | భక్తజన వరద పావన సరసద ముక్తేశ్వరాయరుదా మురహర బిరుదా | bhaktajana varada pAvana sarasada muktESwarAyarudA murahara birudA |
చరణం charaNam 5 | పరమపావన నామ పాలితామరస్తోమ కరుణించి నన్నేలుమా కదనభీమ | paramapAvana nAma pAlitAmarastOma karuNimchi nannElumA kadanabhIma |
చరణం charaNam 6 | సుమహిత రంగపురీ సుస్థిరసద్విహారి అమిత కౌస్తుభధారీ అచ్యుతశౌరి | sumahita ramgapurI susthirasadihAri amita kaustubhadhArI achyutaSauri |
చరణం charaNam 7 | గీర్వాణభాషాధార కేవలానిత్యాకార సర్వదురితౌఘ హరా సర్వేశ్వర | gIrwANabhAshAdhAra kEvalAnityAkAra sarvaduritaugha harA sarvESwara |
చరణం charaNam 8 | సురుచిరానంతపురవర నిలయ భూధర నిరవయ నిర్వికారా నిరాధార | suruchirAnamtapuravara nilaya bhUdhara niravaya nirvikArA nirAdhAra |
చరణం charaNam 9 | నాగభూషణపాల నవ్యగోపికాలోల వేగమే రావదేలా వేణుగోపాలా | nAgabhUshaNapAla navyagOpikAlOla vEgamE rAvadElA vENugOpAlA |