Title | వెలదిరో | veladirO |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | అట | aTa |
1 | వెలదిరో యినుగంటి వెంకట రామరాయ విభుని తోడి తేగదే ఓ చెలియా విభుని తోడి తేగదే తేగదే | veladirO yinugamTi vemkaTa rAmarAya vibhuni tODi tEgadE O cheliyA vibhuni tODi tEgadE tEgadE |
2 | ఘోర సుమశరా సారములోబడి ఓరువదని దెల్పవే ఓ చెలియా ఓరువదని దెల్పవే దెల్పవే | ghOra sumaSarA sAramulObaDi Oruvadani delpavE O cheliyA Oruvadani delpavE delpavE |
3 | ఆ సమీరతానధరా చుంబనమును జేసినది యాది శేయవే ఓ చెలియా జేసినది యాది సేయవే సేయవే | A samIratAnadharA chumbanamunu jEsinadi yAdi SEyavE O cheliyA jEsinadi yAdi sEyavE sEyavE |
4 | నాదు చక్కెర మోవి మీదుగట్టితి ననవే వాదాములిక చాలనవే ఓ చెలియా వాదములిక చాలనవే చాలనవే | nAdu chakkera mOvi mIdugaTTiti nanavE vAdAmulika chAlanavE O cheliyA vAdamulika chAlanavE chAlanavE |
5 | నా భూవిభుని వేగ నన్ను గూర్చిన కనకాభిషేకము జేసెద ఓ చెలియా కనకాభిషేకము జేసెద చేసెద | nA bhUvibhuni vEga nannu gUrchina kanakAbhishEkamu jEseda O cheliyA kanakAbhishEkamu jEseda chEseda |