Title | మొగమాట మించుకలేక | mogamATa mimchukalEka |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | ఆది | Adi |
1 | మొగమాట మించుకలేక పోపొమ్మన దగునా | mogamATa mimchukalEka pOpommana dagunA |
2 | వగకాడ నన్నింత తెగనాడుటేలరా మగువా తావలసిన మనసూ రాదటరా | vagakADa nannimta teganADuTElarA maguvA tAvalasina manasU rAdaTarA |
3 | మోహము చేతను మోవి యానబోతె మోమటు ద్రిప్పితి వేమిరా నాసామి సాహసమున నిన్ను సందిలి బట్టబోతే చాలు చాలునని సాములు జేసేవు మచ్చకంటెవతైనా మందుబెట్టెనటరా మాటలాడవదేరా మనసు దీరగాను పచ్చవిల్తుని ఘోర బాధల సైచక ముచ్చట దీర్చుమనగ మురసెద వేలరా | mOhamu chEtanu mOvi yAnabOte mOmaTu drippiti vEmirA nAsAmi sAhasamuna ninnu samdili baTTabOtE chAlu chAlunani sAmulu jEsEvu machchakamTevatainA mamdubeTTenaTarA mATalADavadErA manasu dIragAnu pachchaviltuni ghOra bAdhala saichaka muchchaTa dIrchumanaga muraseda vElarA |
4 | శ్రీ యినుగంటి కులజేశ శ్రీ ప్రకాశ రాయాత్మజ వేంకట రామ రాయయేరా బాయని ప్రేమను బ్రతిమాలుచుండిన న్యాయముగాదు నన్నారడి సేయుట | SrI yinugamTi kulajESa SrI prakASa rAyAtmaja vEmkaTa rAma rAyayErA bAyani prEmanu bratimAluchumDina nyAyamugAdu nannAraDi sEyuTa |