Title | యినుగంటి వంశపావన | yinugamTi vamSapAvana |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | అట | aTa |
1 | యినుగంటి వంశపావన బుచ్చి తమ్మయ్య మనుజేంద్రుని బ్రతిమాలితిననవే అనయామాతని మనమున నిల్పినాననవే కనుపండువు సేయమనవే రమ్మనవే | yinugamTi vamSapAvana buchchi tammayya manujEmdruni bratimAliti nanavE anayAmAtani manamuna nilpinAnanavE kanupamDuvu sEyamanavE rammanavE |
2 | దానకర్ణుడె విదిత గానాశీలుడె మానీనిగణ నవమారుడె యతడు దీన మందారుడె ధీరోధ్ధతుడె వాని పొందెడబాయలేనే ఓ మానినీ | dAnakarNuDe vidita gAnASIluDe mAnInigaNa navamAruDe yataDu dIna mamdAruDe dhIrOdhdhatuDe vAni pomdeDabAyalEnE O mAninI |
3 | వెన్నెల కాకలు వెక్కసములాయె చిన్ని గాడ్పులు వెడలుచున్నావె చెలియా కన్నాడ వలదనవె కరుణా బూనుమనవే వన్నెకానికి వేగ విన్నావించి రావే | vennela kAkalu vekkasamulAye chinni gADpulu veDaluchunnAve cheliyA kannADa valadanave karuNA bUnumanavE vannekAniki vEga vinnAvimchi rAvE |
4 | చక్కెర విలుకాని శరములకు నన్ను దక్కాజేయుట తనకు తగదు తగదనవే తక్కకు నా తనువు దారాబోసితి ననవే మక్కువ దీర్చ రమ్మనవే తాళజాల | chakkera vilukAni Saramulaku nannu dakkAjEyuTa tanaku tagadu tagadanavE takkaku nA tanuvu dArAbOsiti nanavE makkuva dIrcha rammanavE tALajAla |