Title | నీదు పొందుబాసి | nIdu pomdubAsi |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | శంఖరాభరణం | SankharAbharaNam |
తాళం tALa | జంపె | jampe |
1 | నీదు పొందు బాసి నే నోర్వజాలను వాదేల నిక యేలరా నాతో యిట్టి వాదేల నిక యేలరా | nIdu pomdu bAsi nE nOrvajAlanu vAdEla nika yElarA nAtO yiTTi vAdEla nika yElarA |
2 | వాదమేల విరహ వారధి నేనెట్లు నీదుదాన చలమేల వలదు వలదు | vAdamEla viraha vAradhi nEneTlu nIdudAna chalamEla valadu valadu |
3 | సురతాయాసమున సొక్కియున్న వేళ యెరుకాలేక నేనేమంటినోగాని సరకు సేతురె కనికరము లేక నాపై సరసాగ్రేసర చాలు బీరములింక | suratAyAsamuna sokkiyunna vELa yerukAlEka nEnEmanTinOgAni saraku sEture kanikaramu lEka nApai sarasAgrEsara chAlu bIramulimka |
4 | క్షీరనీరకుచా శ్లేష లక్షణముల కోరికదీర్చర కూరిమి మీరా చేర రార నవచిత్తాజాకారా నేరము సైచి నన్నేలర యికనైన | kshIranIrakuchA SlEsha lakshaNamula kOrikadIrchara kUrimi mIrA chEra rAra navachittAjAkArA nEramu saichi nannElara yikanaina |
5 | యినుగంటి సూర్యరాట్తనయా సదయా హృదయా ధన దోపమ బుచ్చి తమ్మయ్య ధీరా మునుపటి వలె వేగమున నన్ను నెనరున నెనయుము నాదు పాలిండ్లు కానుక సేతు | yinugamTi sUryarATtanayA sadayA hRdayA dhana dOpama buchchi tammayya dhIrA munupaTi vale vEgamuna nannu nenaruna nenayumu nAdu pAlimDlu kAnuka sEtu |