Title | మగువరో నా ముద్దు | maguvarO nA muddu |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | త్రిపుట | tripuTa |
1 | మగువరో నా ముద్దు మగని మాయల జిక్కి మంచిదంటిని వినవే దిగులేల మనకు సందియము దీరుట మేలు తెగనాడి రమ్ము నే తీరాదానను గానూ | maguvarO nA muddu magani mAyala jikki mamchidanTini vinavE digulEla manaku samdiyamu dIruTa mElu teganADi rammu nE tIrAdAnanu gAnU |
2 | మోవియాను వేళ తావులంటిన వేళ నీవి ముట్టిన వేళ నే కౌగలించుచు భావజుదురమున బంధగతుల చేత జీవేశ్వరుని మెప్పించినదెల్లా కల్లలాయె | mOviyAnu vELa tAvulamTina vELa nIvi muTTina vELa nE kaugalimchuchu bhAvajuduramuna bamdhagatula chEta jIvESwaruni meppimchinadellA kallalAye |
3 | రానురాను వాని రాకడ యొకతీరుగాను దోచుచునుండె గంటివే నీవు జాణ యెవ్వతొ మంచి సాటువులు బల్కి నివా నన్నెడబాప వలెనని దలచెనో | rAnurAnu vAni rAkaDa yokatIrugAnu dOchuchunumDe gamTivE nIvu jANa yevvato mamchi sATuvulu balki nivA nanneDabApa valenani dalachenO |
4 | ధరణీవరుడు బుచ్చి తమ్మయ్య మారసుందరుడని నెరనమ్మి దరి జేసినందుకా దరిలేని మోహనా గరము పాలుజేసి సరకుశేయడతని సరళి దెలసి రమ్మా | dharaNIvaruDu buchchi tammayya mArasumdaruDani neranammi dari jEsinamdukA darilEni mOhanA garamu pAlujEsi sarakuSEyaDatani saraLi delasi rammA |