Title | తరుణిరో యినుగంటి | taruNirO yinugamTi |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
1 | తరుణిరో యినుగంటి తమ్మయ్య వసుంధరా వరునిపై నలుక వలదు రావే వేగము | taruNirO yinugamTi tammayya vasumdharA varunipai naluka valadu rAvE vEgamu |
2 | కంతుని నలు నిజయంతుని సొముని వసంతుని నేలిన యెంతో సుందరుడే | kamtuni nalu nijayamtuni somuni vasamtuni nElina yemtO sumdaruDE |
3 | వితరణమున ఘనుడె విభవమున యింద్రుడె చతురత యందున చక్రాయుధ ధరుడె | vitaraNamuna ghanuDe vibhavamuna yimdruDe chaturata yamduna chakrAyudha dharuDe |
4 | మారుని యాలమున కూరిమిని నాధుడో కోరి తావులంటిన నేరముగాదు సుమ్మ | mAruni yAlamuna kUrimini nAdhuDO kOri tAvulamTina nEramugAdu summa |