Title | జాలమేలరా | jAlamElarA |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
తాళం tALa | ఏక | Eka |
1 | జాలమేలరా సామి యేలరా పూలవింటి వాని పోరు యేలా సైతురా | jAlamElarA sAmi yElarA pUlavimTi vAni pOru yElA saiturA |
2 | మోము జూపరా వేగ మోవి యివ్వరా తామసింపనేల మోహ తాప మార్చరా | mOmu jUparA vEga mOvi yivvarA tAmasimpanEla mOha tApa mArcharA |
3 | కౌగిలివ్వరా నాదు కాంక్ష దీర్చరా నాగరాది బంధగతుల నన్ను దేల్చరా | kaugilivvarA nAdu kAmksha dIrcharA nAgarAdi bandhagatula nannu dElcharA |
4 | భూమి నాయకా రాజా బుచ్చి తమ్మయా నా మనంబులోన నిన్నే నమ్మి యుంటిరా | bhUmi nAyakA rAjA buchchi tammayA nA manambulOna ninnE nammi yumTirA |