Title | పణతీరో వినవమ్మ | paNatIrO vinavamma |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | ద్విజావంతి | dvijAvamti |
తాళం tALa | అట | aTa |
1 | పణతీరో వినవమ్మ పతినీ కేలుబట్టి పాన్పుదార్చు వేళ భయము చేత బెనగి యాతని వెనుక జనరాదుసుమ్మ మనమున దిటమూని మన్నించవలెనమ్మ | paNatIrO vinavamma patinI kElubaTTi pAn&pudArchu vELa bhayamu chEta benagi yAtani venuka janarAdusumma manamuna diTamUni mannimchavalenamma |
2 | కపురంపు విడెమిడి కౌగలించరాగ కుపితవై మోముద్రిప్ప గూడదు సుమ్మా కపటమునిడి వేగకదియుట మేలమ్మ నెపమెంచరాదు నీవెపుడు నాధుని పైని | kapurampu viDemiDi kaugalimcharAga kupitavai mOmudrippa gUDadu summA kapaTamuniDi vEgakadiyuTa mElamma nepamemcharAdu nIvepuDu nAdhuni paini |
3 | సామి నీ గుబ్బల చందన మలదిన భామా రోరవ శేయ బాడిగాదమ్మ బ్రేమాను వేసవిని విరులు గట్ట రాగ తామసించి తగవు తగదు తగదమ్మా | sAmi nI gubbala chamdana maladina bhAmA rOrava SEya bADigAdamma brEmAnu vEsavini virulu gaTTa rAga tAmasimchi tagavu tagadu tagadammA |
4 | ధరణీ నాధుడు బుచ్చి తమ్మయేంద్రుడు మిగుల సరసాగ్రేసరుడె చానరో యతడు దరిజేరి యల్లన తావులంటి సుమశరుని పనులు సేయు తరినిక సరరాదు | dharaNI nAdhuDu buchchi tammayEmdruDu migula sarasAgrEsaruDe chAnarO yataDu darijEri yallana tAvulamTi sumaSaruni panulu sEyu tarinika sararAdu |