Title | యేల చలము రార | yEla chalamu rAra |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | ?? | ?? |
తాళం tALa | ?? | ?? |
1 | యేల చలము రారసామీ యేల చలము రారసామీ | yEla chalamu rArasAmI yEla chalamu rArasAmI |
2 | బాళిమీర నిదురరాదు పంచదార తేనె చేదు తాళిమించుకైన లేదు తామసింపవలదు వలదు | bALimIra nidurarAdu pamchadAra tEne chEdu tALimimchukaina lEdu tAmasimpavaladu valadu |
3 | చల్లగాలి నొల్లదాయె స్మరుని పోరు లధికమాయె మల్లెపూలు ముల్లులాయె మాటిమాటికి నిట్టూర్పులాయె | challagAli nolladAye smaruni pOru ladhikamAye mallepUlu mullulAye mATimATiki niTTUrpulAye |
4 | పొలతి నిటుల నేచమేలా బుచ్చి తమ్మయ్య భూపాలా కలసి రతుల దేల్చి చాలా కరుణబూని యేలవేరా | polati niTula nEchamElA buchchi tammayya bhUpAlA kalasi ratula dElchi chAlA karuNabUni yElavErA |