Title | చలమికను | chalamikanu |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | ఆది | Adi |
1 | చలమికను మానీ యేలరా సామి వేగ రారా | chalamikanu mAnI yElarA sAmi vEga rArA |
2 | కులుకు గుబ్బలను గోరులుంచి నా వలపు దీర కౌగిలిని యొసగరా | kuluku gubbalanu gOrulumchi nA valapu dIra kaugilini yosagarA |
3 | చిలుక రౌతు విరిములుకురమునను బలముగ నాటగ సొలసితి నకటా | chiluka rautu virimulukuramunanu balamuga nATaga solasiti nakaTA |
4 | బలు చెలిమిని నిను గలయ గోరినను బలుకవు కస్తురి జిలుకవు తగునా | balu chelimini ninu galaya gOrinanu balukavu kasturi jilukavu tagunA |
5 | మరుడు సాక్షి యీ విరహమోర్వ నా తరము గాదు బుచ్చి తమ్మయ భూపా | maruDu sAkshi yI virahamOrva nA taramu gAdu buchchi tammaya bhUpA |