Title | పాకశాసనదేవ (కృతి) | pAkaSAsanadEva (kRti) |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | త్రిపుట | tripuTa |
1 | పాకశాసనదేవ లోకార్చిత పాద లోకాబాంధవ చంద్రా లోచన యుగళా గోకుల వర్ధన గోపీచేలన చోర మాకభయమొసగి మాధవ బ్రోవరా | pAkaSAsanadEva lOkArchita pAda lOkAbAndhava chandrA lOchana yugaLA gOkula vardhana gOpIchElana chOra mAkabhayamosagi mAdhava brOvarA |
2 | ఘోర సురారిని గూల్చి ప్రహ్లాదుని కోర్కెలెల్లను కొనగూర్చకలేదా పోరున ధీరకుంభీరమును బట్టి జీరి వారణమును జేరి గావగలేదా | ghOra surArini gUlchi prahlAduni kOrkelellanu konagUrchakalEdA pOruna dhIrakumbhIramunu baTTi jIri vAraNamunu jEri gAvagalEdA |
3 | పక్షపాతము మాని రక్షణ సేయుము కక్ష బూనుట బాడి గాదు దాసునిపై పక్షివాహన లోకాధ్యక్షౌ కౌస్తుభ పక్షపాండవ పుత్ర పక్షా నినుగొల్తు | pakshapAtamu mAni rakshaNa sEyumu kaksha bUnuTa bADi gAdu dAsunipai pakshivAhana lOkAdhyakshau kaustubha pakshapAnDava putra pakshA ninugoltu |
4 | జాలమేల కనక చేలా నను వేగ పాలనసేయుము పావనశీలా యాలగాసరిమునుకు చేలుని కరుణను నేలిన విజయ గోపాలా గానలోలా | jAlamEla kanaka chElA nanu vEga pAlanasEyumu pAvanaSIlA yAlagAsarimunuku chEluni karuNanu nElina vijaya gOpAlA gAnalOlA |