Title | మారుబారి కోర్వజాలరా | mArubAri kOrvajAlarA |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | శృంగార జావళ్ళు | SRmgAra jAvaLLu |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
1 | మారుబారి కోర్వజాలరా శ్రీమానినీ మనోహరా | mArubAri kOrvajAlarA SrImAninI manOharA |
2 | నీరేజు సూన కఠోర బాణమ్ములురోరుహముం దాకెరా | nIrEju sUna kaThOra bANammulurOruhamum dAkerA |
3 | ఇందీవరాప్తుని యెండ వేడిమికి కందుచు మేనెల్ల గ్రాగుటె కాకయా మందానిలుడు పల్మారు గగుర్పాటు లొందింప సాగించెరా | indIvarAptuni yenDa vEDimiki kanduchu mEnella grAguTe kAkayA mamdAniluDu palmAru gagurpATu lomdimpa sAgimcherA |
4 | శారికా కీర మయూర మధు వ్రత పారావతనిక రారావములకు తోరంబుగా మది తృళ్ళిపడుచు మహారాటమున్ జెందెరా | SArikA kIra mayUra madhu vrata pArAvatanika rArAvamulaku tOrambugA madi tRLLipaDuchu mahArATamun jemderA |
5 | చయ్యన గబ్బిట సత్కుల జని యజ్ఞయ్యను బ్రోచెడి జలజనయన యా గయ్యాళి జేరి నన్నెయ్యడ నేచుట లయ్యయ్యొ యిది మేరా | chayyana gabbiTa satkula jani yajnayyanu brOcheDi jalajanayana yA gayyALi jEri nanneyyaDa nEchuTa layyayyo yidi mErA |