Title | ఈ మోహమెట్టోర్తురా | I mOhameTTOrturA |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
1 | ఈ మోహమెట్టోర్తురా వేగ ప్రేమ జూచి యేలుకోర | I mOhameTTOrturA vEga prEma jUchi yElukOra |
2 | నీ మీదను నా మానసమేమారక చిక్కెగదరా మేనున గరుపాటులు వేమారును గల్గెనుర | nI mIdanu nA mAnasamEmAraka chikkegadarA mEnuna garupATulu vEmArunu galgenura |
3 | పిక్కటాలు వక్షోజము లెక్కుడుగ పొంగారెర మక్కువగ నీ కౌగిలి యొక్కపరి నీగదర | pikkaTAlu vakshOjamu lekkuDuga pomgArera makkuvaga nI kaugili yokkapari nIgadara |
4 | దట్టమగు చెమ్మటలు బుట్టి మదిగట్టి చెడి గుట్టు విడి వెచ్చనగు నిట్టూర్పులు వచ్చెనుర | daTTamagu chemmaTalu buTTi madigaTTi cheDi guTTu viDi vechchanagu niTTUrpulu vachchenura |
5 | ఇంతంతనని కోర్కెలు స్వాంతమున గంతులిడె వింతలుగ శ్రీ గబ్బిట యజ్ఞేశనుత | imtamtanani kOrkelu svAmtamuna gamtuliDe vimtaluga SrI gabbiTa yajnESanuta |