Title | వానిజూడు మెందున్నాడో | vAnijUDu memdunnADO |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | నాటకురంజి | nATakuramji |
తాళం tALa | ఆది | Adi |
1 | వానిజూడు మెందున్నాడో సఖియ | vAnijUDu memdunnADO sakhiya |
2 | నాణెంపు బల్కుల దేనెలొల్కువాడే | nANempu balkula dEnelolkuvADE |
3 | నిద్దమైన చెక్కుతద్దముల సౌరు ముద్దుగారు మోము మోవికెంపు వాడే | niddamaina chekkutaddamula sauru muddugAru mOmu mOvikempu vADE |
4 | బంగారు దువ్వలువ వల్లెవాటు వైచి సంగీతమ్ము జేయు చహలు గల్గువాడే | bamgAru duvvaluva vallevATu vaichi samgItammu jEyu chahalu galguvADE |
5 | చల్లని చూపుల సత్కవిత్కముల పెల్లైన యీవుల పేరు బొందువాడే | challani chUpula satkavitkamula pellaina yIvula pEru bomduvADE |
6 | అనయము గబ్బిట యజ్ఞన్న కవీంద్ర వినుతుడైన రంగ విభుడింక రాడాయె | anayamu gabbiTa yajnanna kavIndra vinutuDaina ramga vibhuDimka rADAye |