Title | వినవే సామి చేసిన | vinavE sAmi chEsina |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | రూపక | rUpaka |
1 | వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలి | vinavE sAmi chEsina panulan delipeda cheli |
2 | కనుల నిండ నే నిదురగొని నటులుండిన వేళను చనవున గడపినవన్నియు | kanula ninDa nE niduragoni naTulunDina vELanu chanavuna gaDapinavanniyu |
3 | నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున | ninna rEyi pAn&pu ninDu vennelalO vaichi panDi yunna vELa nAdupaini vannekADu sannajAjulinni challe nelanavvuna |
4 | మేలైన గదంబు రోజ పాళి నలది పెదవి తేనె గ్రోలి ముద్దు బెట్టి గోపాలుడు సుఖలీలల ననుదేలించెనె నీలవేణి | mElaina gadambu rOja pALi naladi pedavi tEne grOli muddu beTTi gOpAluDu sukhalIlala nanudElimchene nIlavENi |
5 | ఇల గబ్బిట యజ్ఞనాఖ్యు గృపమీర నేలినట్టి నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల హారము నెలమి నొసగె | ila gabbiTa yajnanAkhyu gRpamIra nElinaTTi nalikAkshuDiTlu jEsi velalEnivi gala mAnikamula hAramu nelami nosage |