Title | హాయికల్గెనురా | hAyikalgenurA |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | రూపక | rUpaka |
1 | హాయికల్గెనురా చాలగ ||హా|| నామది ||హా|| నీయొయ్యారంపు పాటల | hAyikalgenurA chAlaga ||hA|| nAmadi ||hA|| nIyoyyArampu pATala |
2 | నీయెడ బాళిని నేను రాగానెరా వేయని ముద్దిడి యెదను జేర్చి వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో | nIyeDa bALini nEnu rAgAnerA vEyani muddiDi yedanu jErchi vEyi mOrIlu jEyu bigikaugilIya nIvemtO |
3 | మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి సుగంధము కూర్మిబూయ గారామున నీ తీరౌ మోవిసుధారసమీయ | mAraSatOjvalAkAra nEnayyeDa kOri sugamdhamu kUrmibUya gArAmuna nI tIrau mOvisudhArasamIya |
4 | మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ చక్కలిగింతలు చాలగొల్పి చొక్కింపు గోట నొక్కుచు బాలిండ్లెక్కుడు బెనగ | makkuva nEnu nI chekkili goTTaga chakkaligimtalu chAlagolpi chokkimpu gOTa nokkuchu bAlimDlekkuDu benaga |
5 | ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక బ్రోచెడి శౌరి నేడు చారు నానా బంధోచాతురీ మారునికేళి | Arasi gabbiTa yajnana satkavi vAraka brOcheDi Sauri nEDu chAru nAnA bamdhOchAturI mArunikELi |