Title | కోమలాంగి | kOmalAmgi |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
తాళం tALa | ఆది | Adi |
1 | కోమలాంగి తాళకున్నదిరా తామరస విలోచన | kOmalAmgi tALakunnadirA tAmarasa vilOchana |
2 | సామిరాగదర కామినిక గనగ నా మనోజుని శరానలంబునకు | sAmirAgadara kAminika ganaga nA manOjuni SarAnalambunaku |
3 | చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర సుందర శరీర యెందరైన నిన్ను బోలరంచు నీ యందంబు చందంబు డెందంబునందలచి | chandanagandhi nIyamdanurAgamu jemdiyunnadira sumdara SarIra yemdaraina ninnu bOlaramchu nI yamdambu chamdambu Demdambunamdalachi |
4 | కూరిమి మీరగ వారిజముఖిని జేరి సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు సేయ మేరగాదు వేవేగమే రార సారెకు నీ రాక నారయుచు | kUrimi mIraga vArijamukhini jEri sukhimpara SrI rukmiNIlOla vEru sEya mEragAdu vEvEgamE rAra sAreku nI rAka nArayuchu |
5 | వావిగ గబ్బిట వంశజ యజ్ఞన సేవిత నీకై యాసించి యున్నదిర యే విధాననైన దాని గ్రీడింపు భావింప మీవేళ శ్రీవేణుగోపాలక | vAviga gabbiTa vamSaja yajnana sEvita nIkai yAsimchi yunnadira yE vidhAnanaina dAni grIDimpa bhAvimpu mIvELa SrIVENugOpAlaka |