Title | చిన్న ముద్దీరా | chinna muddIrA |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | హిందూస్తాని కాఫీ | himdUstAni kAfI |
తాళం tALa | ఆది | Adi |
1 | చిన్నముద్దీరా నాసామి | chinnamuddIrA nAsAmi |
2 | కన్నుల పండువుగా నిను గనగనె వెన్నవలెను మది వేగ గరగురా | kannula panDuvugA ninu ganagane vennavalenu madi vEga garagurA |
3 | సరసత నీవొకసారి మాటాడిన బొరి బొరి మేన బులక లెచ్చురా | sarasata nIvokasAri mATADina bori bori mEna bulaka lechchurA |
4 | అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె కమ్మని కోర్కెలు గలుగుచుండురా | ammakachella ninnanTina mAtrane kammani kOrkelu galuguchumDurA |
5 | కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞన నమిత చరణ విడనాడజాలరా | kamalA priya SrI gabbiTa yajnana namita charaNa viDanADajAlarA |