Title | చాలు చాలు | chAlu chAlu |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | రూపక | rUpaka |
1 | చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ | chAlu chAlu nIdu chelmi jADadelise mAninI |
2 | వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీ | vrAlabOku kALLapaini lElE hamsagAminI |
3 | గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే | gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA balAre vAni gUDitiga bhAmA nE nIkETikE |
4 | అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే | alla vayasu ThIpulu nIyamde molchinavaTE yella chAnalaku lEvE yI gOTu nIkETikE |
5 | ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే | imdirESvarumDa nI nA pomdu nIku galgunE amdulakE yEgu yajnanAptunaku taguduvE |
[…] చాలు చాలు రాగం బ్యాగ్ తాళం రూపక […]
LikeLike