Title | మందయాన | mandayAna |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | అఠాణ | aThANa |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మందయాన నీ పొందుగోరి నను బంపింది రార సామీ | mandayAna nI pondugOri nanu bampimdi rAra sAmI |
చరణం charaNam 1 | మందయాన నీ పొందుగోరినది పసందు మీరిన అందగత్తెర సందడించి రతులందమంద నందరసము పొలుపొందజేయ విను గొందువనుచు నీయందు చాల భ్రమ జెంది నాతొ దెల్పింది నన్ను బంపింది వహ్వ పూసింది నిన్ను రమ్మంది సుందరరాచెందొవ విందుచే కందియుందిరా నీయందు ప్రేమచే చిందర వందర చెందం పొందర | mandayAna nI pondugOrinadi pasandu mIrina andagattera samdaDimchi ratulamdamamda namdarasamu polupomdajEya vinu gomduvanuchu nIyamdu chAla bhrama jemdi nAto delpindi nannu bampindi vahva pUsindi ninnu rammandi sundararAchendova vinduchE kandiyundirA nIyandu prEmachE chindara vandara chendam pondara |
చరణం charaNam 2 | బాలకురులు నీలాలు కనులు మీవాలు పలువరుస జాలు మంచి ముత్యాలు మోవి పగడాలు జురిడీలు గావు మురిడీలు చేతుల పిడేలు బాడగలశీల చెవులు చెక్రాలు మాటలు వరాలు చెక్కగద వీలు నెలయు కపురాలు కవకుదగు పాలు వయసు నీపాలు తనువు జిగి జాళువా సుమీ బాల నీవు రతినేల గాదగు లీలలమరిన గోలర మేలుగ నేలర కేళిని | bAlakurulu nIlAlu kanulu mIvAlu paluvarusa jAlu manchi mutyAlu mOvi pagaDAlu juriDIlu gAvu muriDIlu chEtula piDElu bADagalaSIla chevulu chekrAlu mATalu varAlu chekkagada vIlu nelayu kapurAlu kavakudagu pAlu vayasu nIpAlu tanuvu jigi jALuvA sumI bAla nIvu ratinEla gAdagu lIlalamarina gOlara mEluga nElara kELini |
చరణం charaNam 3 | సుళ్ళు సిరులొసంకళ్ళు బొరులు దిళ్ళు దాని పాలిళ్ళు మొల్ల పూచెళ్ళు చెలువమగు వళ్ళు కెరటముల జాళ్ళు బాహువుల నీళ్ళు తామరల తూళ్ళు కిసలములు వేళ్ళు తారకలు గోళ్ళు పిక్కలు మొసళ్ళు కలికి మీగాళ్ళ సౌరు తాబేళ్ళ సరి పదారేళ్ళ వయసురా యేళ్ళ కొలది వేయి నోళ్ళ నుతించి న వల్ల గాదు పెరుమాళ్ళ కృపనయిన | suLLu sirulosamkaLLu borulu diLLu dAni pAliLLu molla pUcheLLu cheluvamagu vaLLu keraTamula jALLu bAhuvula nILLu tAmarala tULLu kisalamulu vELLu tArakalu gOLLu pikkalu mosaLLu kaliki mIgALLa sauru tAbELLa sari padArELLa vayasurA yELLa koladi vEyi nOLLa nutimchi na valla gAdu perumALLa kRpanayina |
చరణం charaNam 4 | బోటి చక్కెరల పేటి యెల్ల రతితోవి కూటమికి సాటియై తగు వధూటి సుందరా బోటి గుబ్బలు కొనగోట మీట నెంతొ పాటమౌర నీవాటల పాటల కూటమి గూడర | bOTi chakkerala pETi yella ratitOvi kUTamiki sATiyai tagu vadhUTi sundarA bOTi gubbalu konagOTa mITa nemto pATamaura nIvATala pATala kUTami gUDara |
చరణం charaNam 5 | కంబుకౌను సుముఖంబు చందురుని సఖంబు గళము శంఖంబు కన్నుల సుఖంబు దానియందంబు మోవి బింబంబు పలుకు మధురంబు మేని నా సంబు సుతల పుష్పంబు నుదుట తిలకంబు హొయల్ గల కంబుకంఠిరా డింబుమీర సురతంబు లందు సారంబు గలది పూనంబగు చుంబునలంబ విజృంభిత | kambukaunu sumukhambu chamduruni sakhambu gaLamu Samkhambu kannula sukhambu dAniyamdambu mOvi bimbambu paluku madhurambu mEni nA sambu sutala pushpambu nuduTa tilakambu hoyal gala kambukamThirA DimbumIra suratambu lamdu sArambu galadi pUnambagu chumbunalamba vijRmbhita |
చరణం charaNam 6 | శేష శయన ద్విభాషి పుల్లకవి పోష సుందరీ భూషితాంగ సంతోష హృదయ మృదుభాషకు ప్రియా వాసి మీద దానితో సురతములను జేసి మెలగుము వికాస ముఖాసర నాదయారస | SEsha Sayana dvibhAshi pullakavi pOsha sundarI bhUshitAmga samtOsha hRdaya mRdubhAshaku priyA vAsi mIda dAnitO suratamulanu jEsi melagumu vikAsa mukhAsara nAdayArasa |