Title | చెలువుని తోడితేవె | cheluvuni tODitEve |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
తాళం tALa | అట | aTa |
1 | చెలువుని తోడి తేవె కలహంస గమనరొ వల రాచకేళికి వలపించి పూశయ్యకు | cheluvuni tODi tEve kalahamsa gamanaro vala rAchakELiki valapimchi pUSayyaku |
2 | దవ్వుల జూచినానే నవ్వు మొగము వాడే జవ్వనమయిన వాడే వహ్వరి తగిన జోడే | davvula jUchinAnE navvu mogamu vADE javvanamayina vADE vahvari tagina jODE |
3 | కామిని వాని మోము శోమునితో సమము కాముని సుందరము కనగల్గెనే మోహము | kAmini vAni mOmu SOmunitO samamu kAmuni sumdaramu kanagalgenE mOhamu |
4 | తారక వేగోరులు హారాణి పల్తీరులు చేరావె కన్బారులు నీరదముల్ కురులు | tAraka vEgOrulu hArANi paltIrulu chErAve kan&bArulu nIradamul kurulu |
5 | తీరైన పలుకులు తేనియ లొలుకులు తోరంపు చూడ్కులు మారుని పూముల్కులు | tIraina palukulu tEniya lolukulu tOrampu chUDkulu mAruni pUmulkulu |
6 | కాపాడుమా దేహము కాకున్న చేద్రోహము చూపగదే స్నేహము ఆపలేనే మోహము | kApADumA dEhamu kAkunna chEdrOhamu chUpagadE snEhamu ApalEnE mOhamu |
7 | ద్విభాషి పుల్లకవి ప్రాభవుడౌ భారవి శోభిత గుణ పద్మనాభునీ శ్రీవిభుని | dvibhAshi pullakavi prAbhavuDau bhAravi SObhita guNa padmanAbhunI SrIvibhuni |