Title | నాణెమైన వలపుల | nANemaina valapula |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఆది | Adi |
1 | నాణెమైన వలపుల చెలిరా నిను జాణవనుచు పిలువమనెరా ఆణిముత్తియంబులు పలుతీరు అందమైన నూగారు పాణులు పల్లవ మది రుచులూరు వాణిని తేనెలుగారు | nANemaina valapula chelirA ninu jANavanuchu piluvamanerA ANimuttiyambulu palutIru amdamaina nUgAru pANulu pallava madi ruchulUru vANini tEnelugAru |
2 | కాముక హృత్కల్పము తనువల్లి మోము పండుజాబిల్లి శ్రీమించిన సుగుణ గణముతల్లి హేమగదర యిదితొల్లి | kAmuka hRtkalpamu tanuvalli mOmu panDujAbilli SrIminchina suguNa gaNamutalli hEmagadara yiditolli |
3 | గోరులు తారలచాలగ నేలు గోలు పల్కులవరాలు బారు కురులు నిగ నిషనీలాలు బాలవయసు నీపాలు | gOrulu tAralachAlaga nElu gOlu palkulavarAlu bAru kurulu niga nishanIlAlu bAlavayasu nIpAlu |
4 | తావి చనురబరిణెల బిరడాలు మోవికెంపు పగడాలు నీవు గవదయగు సఖి మెయిడాలు లేవు గదర తేడాలు | tAvi chanurabariNela biraDAlu mOvikempu pagaDAlu nIvu gavadayagu sakhi meyiDAlu lEvu gadara tEDAlu |
5 | కాంచిన మును నిరసించుర యొడలు అంచనేరు దానడలు మించు రంభల హసించుర తొడలు యెంచితి విరనలడలు | kAmchina munu nirasimchura yoDalu anchanEru dAnaDalu minchu rambhala hasimchura toDalu yemchiti viranalaDalu |
6 | మున్ను నుంచి కాపురమీయూరు ముద్దుగుమ్మరా పేరు కన్నెను జూడ తయారగు తేరు కన్నులకు కరువులేదు | munnu numchi kApuramIyUru muddugummarA pEru kannenu jUDa tayAragu tEru kannulaku karuvulEdu |
7 | భామా హృత్పంకజ హర్షా ద్విభాషి పుల్లకవి పోషా కామిత ఫలదాయక గత రోషా భూమిజా మనోల్లాసా | bhAmA hRtpankaja harshA dvibhAshi pullakavi pOshA kAmita phaladAyaka gata rOshA bhUmijA manOllAsA |