Title | ఎడబాసి | eDabAsi |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | చక్రవాకం | chakravAkam |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | ఎడబాసి గడియోర్వజాలనురా జోడెడబాసి | eDabAsi gaDiyOrvajAlanurA jODeDabAsi |
చరణం charaNam 1 | గొడవలింతకు హెచ్చినన్ మదినొచ్చినన్ పడకకును రాకున్న నిన్నొక గడియైనను విడువజాలనురా ||జోడెడ|| | goDavalimtaku hechchinan madinochchinan paDakakunu rAkunna ninnoka gaDiyainanu viDuvajAlanurA ||jODeDa|| |
చరణం charaNam 2 | ఇటులారడి సేయుట ముచ్చటగా దెతులైనను చెంగట నుంచుట మేలు తటపటాయించుట సదా మరలుటగురా గుటుకు గుటుకున గ్రుక్కలూరించుటలు తగవగు నటరా నీ ||జోడెడ|| | iTulAraDi sEyuTa muchchaTagA detulainanu chengaTa numchuTa mElu taTapaTAyimchuTa sadA maraluTagurA guTuku guTukuna grukkalUrinchuTalu tagavagu naTarA nI ||jODeDa|| |
చరణం charaNam 3 | సరివారలు మెచ్చనీ మెచ్చకపోనీ గురివెలి జేసిన నిరసన గాదటరా నీ సరసమెరిగిన దాన నీ దానరా సరిసరిరా నీ మురిపెమునల గురుతెరుగుదుర నా దొరవునీ ||జోడెడ|| | sarivAralu mechchanI mechchakapOnI guriveli jEsina nirasana gAdaTarA nI sarasamerigina dAna nI dAnarA sarisarirA nI muripemunala guruterugudura nA doravunI ||jODeDa|| |
చరణం charaNam 4 | కలకాలము రవ్వల పాలయినన్ చలమెల్లను నిష్ఫలములయ్యెనురా నా వలపు తెలిసిన పాడవు వగకాడవు పలు విధమ్ముల నలరువిలుతుని పనులలోపల మెలగునీ ||జోడెడ|| | kalakAlamu ravvala pAlayinan chalamellanu nishphalamulayyenurA nA valapu telisina pADavu vagakADavu palu vidhammula nalaruvilutuni panulalOpala melagunI ||jODeDa|| |
చరణం charaNam 5 | మకరధ్వజ జనక నాకిక ప్రాపకమైతివి తేలిక సేయకురా చంపక ముకుళ సమవాసికా శోభన ముఖా ప్రకటమైన ద్విభాషికుల పుల్లకవి సన్నుతి నికర నీ ||జోడెడ|| | makaradhvaja janaka nAkika prApakamaitivi tElika sEyakurA champaka mukuLa samavAsikA SObhana mukhA prakaTamaina dvibhAshikula pullakavi sannuti nikara nI ||jODeDa|| |