Title | వగలాడి | vagalADi |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | వగలాడి దిగులిడ నోర్వగదే వో | vagalADi diguliDa nOrvagadE vO |
అనుపల్లవి anupallavi | చిగురుబోడిరో జాలమా యిది శీలమా తగు తగునే యిది తగువగునె తమి దగిలి రతులను దిగియ జేయవె ఓ | chigurubODirO jAlamA yidi SIlamA tagu tagunE yidi taguvagune tami dagili ratulanu digiya jEyave O |
చరణం charaNam 1 | కలిగి మిటారీ లలిత బింబాధరీ వలపుల దేర్పవే వల రాచకేళిలో నీ వలపు నిలుపగ రాదటే మర్యాదటే కలకలమ్ముగ నలగి మన్మధ కళల దేరగ గలయ రాగదే | kaligi miTArI lalita bimbAdharI valapula dErpavE vala rAchakELilO nI valapu nilupaga rAdaTE maryAdaTE kalakalammuga nalagi manmadha kaLala dEraga galaya rAgadE |
చరణం charaNam 2 | కోపము దేలే ఆపలేనే మోహము నే పగవాడన నీకు దెలియదటే నీ రూపురేఖలు నిక్కమా తమి దక్కుమా పాపరాధుడగామ మోహోద్దీప తాపము బాపివేయవే | kOpamu dElE ApalEnE mOhamu nE pagavADana nIku deliyadaTE nI rUpurEkhalu nikkamA tami dakkumA pAparAdhuDagAma mOhOddIpa tApamu bApivEyavE |
చరణం charaNam 3 | పల్లవ పాణీ పుల్లాబ్జలోచనీ యుల్లము నీపయి నల్లన నిల్పెగదే ఓ మల్లెపువ్వుల బంతిరొ మరుదంతిరో సల్లలిత ద్విభాషి కులభవ పుల్లకవి నుత పల్లవీమణి | pallava pANI pullAbjalOchanI yullamu nIpayi nallana nilpegadE O mallepuvvula bantiro marudantirO sallalita dvibhAshi kulabhava pullakavi nuta pallavImaNi |