Title | వన్నెలాడి | vannelADi |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | వన్నెలాడి విన్నవించవే | vannelADi vinnavinchavE |
అనుపల్లవి anupallavi | మొన్నటి పున్నమ రేయి కన్నులార నిన్నే జూచి యెన్నరాని మోహముచే నున్నదనుచును | monnaTi punnama rEyi kannulAra ninnE jUchi yennarAni mOhamuchE nunnadanuchunu |
చరణం charaNam 1 | శారి కాకేరాళి రవ దారుణము కోర్వక నీదారి జూచుచుండె దయోదార యనుచును | SAri kAkErALi rava dAruNamu kOrvaka nIdAri jUchuchunDe dayOdAra yanuchunu |
చరణం charaNam 2 | సుందరా నీయందు తమిజంది యాసజెంది గాసియుందిర తొందర రతులందు దన్పుమని | sundarA nIyandu tamijandi yAsajendi gAsiyundira tondara ratulandu dan&pumani |
చరణం charaNam 3 | జోడుగూడ వీడని పూబోడి వానితోడ మాటలాడి తెమ్మనెగవ కూడు మనుచును | jODugUDa vIDani pUbODi vAnitODa mATalADi temmanegava kUDu manuchunu |
చరణం charaNam 4 | భాసురమగు దుర్గాడ వాసుడు ద్విభాషి పుల్లకవీశ పోష దోషనాశ శ్రీయనుచు | bhAsuramagu durgADa vAsuDu dvibhAshi pullakavISa pOsha dOshanASa SrIyanuchu |