Title | నేరమా సామీ | nEramA sAmI |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | ??? | ??? |
తాళం tALa | ??? | ??? |
పల్లవి pallavi | నేరమా సామీ నాపై నేరమా కోరితిర నిను పాడిగ పర సారసాక్షులు గూడగ | nEramA sAmI nApai nEramA kOritira ninu pADiga para sArasAkshulu gUDaga |
చరణం charaNam 1 | దారిగాదని నుడివి నిను నాయాధారమని కడు వేడగా నా వాదమా సామీ నాతో వాదమా చేదుయయ్యెనే బెల్లము మర్యాద వాయునే యుల్లము యేది యున్నను తెల్లము నీ మీది తమితో నుండి గదనా | dArigAdani nuDivi ninu nAyAdhAramani kaDu vEDagA nA vAdamA sAmI nAtO vAdamA chEduyayyenE bellamu maryAda vAyunE yullamu yEdi yunnanu tellamu nI mIdi tamitO nunDi gadanA |
చరణం charaNam 2 | యొల్లవా సౌందర్య గణిగా పల్లవా చెల్లునే సరసునకిది నా వల్లభుడ నీవని మది నుల్లసింపుచు నుంటి వేగమె పల్లవాగ్రణి రమ్ముకేళికి | yollavA saundarya gaNigA pallavA chellunE sarasunakidi nA vallabhuDa nIvani madi nullasimpuchu nunTi vEgame pallavAgraNi rammukELiki |
చరణం charaNam 3 | రోషమా విటరాయ నీకిది వేషమా నా దోషమేమియు లేదురా మృదు భాషణ ప్రియ శ్రీధరా భూషితాగమవాసి యగు ద్వి భాషి పుల్లకవీశనుత నా | rOshamA viTarAya nIkidi vEshamA nA dOshamEmiyu lEdurA mRdu bhAshaNa priya SrIdharA bhUshitAgamavAsi yagu dvi bhAshi pullakavISanuta nA |