Title | మహరాజును | maharAjunu |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | అఠాణా | aThANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మహరాజును జూచితివా సఖీ యీ || | maharAjunu jUchitivA sakhI yI || |
అనుపల్లవి anupallavi | మహిళా సరసీరుహ బాణుడే యీ || | mahiLA sarasIruha bANuDE yI || |
చరణం charaNam 1 | సఖి కబ్బెనెకో మహిమలకు మదనుడు గదే సుఖ రహి గదే యహహ యీతని సరి సరసులీ మహిని లేరనుటె నిజము | sakhi kabbenekO mahimalaku madanuDu gadE sukha rahi gadE yahaha yItani sari sarasulI mahini lEranuTe nijamu |
చరణం charaNam 2 | నవనీతము కన్నను మార్గవ మీ నవ మోహనుడెందము నెంచినచో యివిద వానిని గంటివే వినియుంటివే నవరసాయుత పల్లవీ మన నయన జలరుహ చంద్రుడే | navanItamu kannanu mArgava mI nava mOhanuDendamu nenchinachO yivida vAnini ganTivE viniyunTivE navarasAyuta pallavI mana nayana jalaruha chandruDE |
చరణం charaNam 3 | రమణీయ మనోరమణీగన చిత్తము తత్తరమె తను కించుగదే కమల శరసౌందర్యుడే గుణధుర్యుడే రమణులను దనియింప నింతటి రసికుడీ యిల గలడటే | ramaNIya manOramaNIgana chittamu tattarame tanu kinchugadE kamala SarasaundaryuDE guNadhuryuDE ramaNulanu daniyimpa nimtaTi rasikuDI yila galaDaTE |
చరణం charaNam 4 | గడు సుందరము గడు సుందరమున్గములే ప్రియుడు న్గమలాత్మజుడే తొడవు లీతని గుణములు రిపురణములు కుడి యెడమ లేదడుగు నర్ధులకిడు నెడల తడవుడిగి యిడు | gaDu sundaramu gaDu sundaramun&gamulE priyuDu n&gamalAtmajuDE toDavu lItani guNamulu ripuraNamulu kuDi yeDama lEdaDugu nardhulakiDu neDala taDavuDigi yiDu |
చరణం charaNam 5 | సుకరమ్ముగ కీర్తికలా లాస ద్విభాషి కులీనుడు పుల్లకవి వినుతుడే సకల సుకళాలోలుడే గోపాలుడే మకుట మానిత రావు వంశకుమార సూర్య రాయవరుడౌ | sukarammuga kIrtikalA lAsa dvibhAshi kulInuDu pullakavi vinutuDE sakala sukaLAlOluDE gOpAluDE makuTa mAnita rAvu vamSakumAra sUrya rAyavaruDau |