Title | మానినీ మణిరో | mAninI maNirO |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | దర్బారు | darbAru |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మానినీ మణిరో వాని మనసు కరుగదాయనే మనసు కరుగదాయెనా మనవి వినడాయెనే | mAninI maNirO vAni manasu karugadAyanE manasu karugadAyenA manavi vinaDAyenE |
చరణం charaNam 1 | అత్తరు పన్నీరు గంధమలది రారమ్మంటినే అలది రారమ్మంటినే నా యనుగుకాడవంటినే | attaru pannIru gandhamaladi rArammanTinE aladi rArammanTinE nA yanugukADavanTinE |
చరణం charaNam 2 | కావిమోవి దొండపండు కాన్కగైకొమ్మంటినే కాన్కగైకొమ్మంటినే బిగికౌగిలి యిమ్మంటినే | kAvimOvi donDapanDu kAn&kagaikommanTinE kAn&kagaikommanTinE bigikaugili yimmanTinE |
చరణం charaNam 3 | వింతగ చన్గవ పూల బంతులాడమంటినే బంతులాడమంటినే నే నీకింత గూడదంటినే | vintaga chan&gava pUla bantulADamanTinE bantulADamanTinE nE nIkinta gUDadanTinE |
చరణం charaNam 4 | కోరి పిలువగానే శుక్రవారమన్నట్లాయనే శుక్రవారమన్నట్లాయనే సరివారిలో నగుబాట్లాయనే | kOri piluvagAnE SukravAramannaTlAyanE SukravAramannaTlAyanE sarivArilO nagubATlAyanE |
చరణం charaNam 5 | పొడిమాటలచే కోర్కెదీరిపోవునే ఎవ్వరికైన పోవునె యెవ్వరికైన ఆ భోగ దేవేంద్రునికైన | poDimATalachE kOrkedIripOvunE evvarikaina pOvune yevvarikaina A bhOga dEvEndrunikaina |
చరణం charaNam 6 | భువిలోన ద్విభాషి పుల్లకవి రాజవరదుడె కవి రాజవరదుడే నన గవయదగు గోపాలుడే | bhuvilOna dvibhAshi pullakavi rAjavaraduDe kavi rAjavaraduDE nana gavayadagu gOpAluDE |