Title | హా సఖా | hA sakhA |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | హిందుస్థానీ తోడి | hindusthAnI tODi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | హా సఖా నిను యే సఖీమణి గాసి మందు రాసెరా రాసెరా విడదీసెరా శహబాసురా యెంతజేసెరా | hA sakhA ninu yE sakhImaNi gAsi mandu rAserA rAserA viDadIserA SahabAsurA yemtajEserA |
చరణం charaNam 1 | హాయిగా నిను డాయవచ్చిన దాయగా కడుమాయగా ఆయెగా కడుమాయగా యిది నాయమా నా నాయకా | hAyigA ninu DAyavachchina dAyagA kaDumAyagA AyegA kaDumAyagA yidi nAyamA nA nAyakA |
చరణం charaNam 2 | వంచల నను కించ పరచుట మంచి గాదని యెంచెరా దయయుంచి మది మరలించరా | vamchala nanu kimcha parachuTa manchi gAdani yemcherA dayayunchi madi maralimcharA |
చరణం charaNam 3 | నెమ్మదిని నిను నమ్మి యుంటిర కమ్మ విల్తుని కేళికే కమ్మ విల్తుని కేళికీ సరసమ్ము గలనీ పాలికీ | nemmadini ninu nammi yumTira kamma viltuni kELikE kamma viltuni kELikI sarasammu galanI pAlikI |
చరణం charaNam 4 | వాసిగా ద్విభాషి పుల్లకవీశ సన్నుత వేగరా యీశ సన్నుత వేగరార దయా సుధారస సాగరా | vAsigA dvibhAshi pullakavISa sannuta vEgarA yISa sannuta vEgarAra dayA sudhArasa sAgarA |