Title | తెలియదే | teliyadE |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1991) | hindusthAnI kAfI (1893) kAfI (1991) |
తాళం tALa | అట (1893) ఆది (1991) | aTa (1893) Adi (1991) |
పల్లవి pallavi | తెలియ దెలియదె తెలియదె మాయ వలపులొ సొలపులొ వాని గుణమేమొ కాని | teliya deliyade teliyade mAya valapulo solapulo vAni guNamEmo kAni |
చరణం charaNam 1 | వలపించుటే కాని వలచుట లేడే దాని కలనైన మరువడే కానీ పని చేసినాడే | valapinchuTE kAni valachuTa lEDE dAni kalanaina maruvaDE kAnI pani chEsinADE |
చరణం charaNam 2 | చెలియరో నేనేమందు బలమగు దానిమందు తలకెక్కెనేమో నందువలన రాడే యిందు | cheliyarO nEnEmandu balamagu dAnimandu talakekkenEmO nanduvalana rADE yindu |
చరణం charaNam 3 | వేమరు ననుగూడి వాడు నింత మాటలాడినాడు భామా దాసు శ్రీరామ పాలుడె గోపాలుడె | vEmaru nanugUDi vADu ninta mATalADinADu bhAmA dAsu SrIrAma pAluDe gOpAluDe |