Title | మాటాడి పొమ్మనవె | mATADi pommanave |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 | |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మాటాడి పొమ్మనవె మంజులవాణి వానినొక | mATADi pommanave manjulavANi vAninoka |
అనుపల్లవి anupallavi | నీటి మూట తోటి సాటి బూటకము లేటికి మంచి | nITi mUTa tOTi sATi bUTakamu lETiki manchi |
చరణం charaNam 1 | రద్ది యేల వద్దనుచు కొద్దిగాను బుధ్ధి చెప్పి ముద్దియ మోమున మోముడి ముద్దులు గుల్కు యొద్ద జేరియొక | raddi yEla vaddanuchu koddigAnu budhdhi cheppi muddiya mOmuna mOmuDi muddulu gulku yodda jEriyoka |
చరణం charaNam 2 | చిన్నవాడే నన్ను గూడె వన్నెకాడే వాడనుచు కన్నె మిన్న నిన్నే కోరి యున్నదిర యిక వన్నె మీర నొక | chinnavADE nannu gUDe vannekADE vADanuchu kanne minna ninnE kOri yunnadira yika vanne mIra noka |
చరణం charaNam 3 | భాసురాంగ గోపాలుని బాసలచే మోసపోతి దోసమేమి చేసితినో దాసురామ కవితా సుధా సురుచి | bhAsurAm^ga gOpAluni bAsalachE mOsapOti dOsamEmi chEsitinO dAsurAma kavitA sudhA suruchi |